News June 11, 2024
ఒంగోలు: జిల్లాకు త్వరలో కొత్త అధికారుల జట్టు..!

ప్రస్తుతం జిల్లాలోని కీలక స్థానాలో ఉన్న అధికారుల్లో ఎక్కువ మంది మూడేళ్లకు పైగా కొనసాగుతున్నారు. వీరిలో పాటు, వైసీపీ మంత్రులు, MLAల సిఫార్సులతో వచ్చినవారు ఉన్నారు. TDP అధికారంలోకి రావడంతో రాష్ట్రస్థాయిలో కీలక స్థానాల్లో అధికారుల మార్పు మొదలైంది. తొలుత కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డీఆర్వో ఉంటనున్నట్లు తెలుస్తోంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి, జిల్లా మత్య్సశాఖ అధికారి పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News July 5, 2025
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
News July 5, 2025
బాలినేనికి ఇక అంతా బాగేనా?

బాలినేనిని జిల్లా రాజకీయాలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనిపేరు. అటువంటి బాలినేనికి ఇకపై అంతా మంచే జరగబోతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మార్కాపురానికి డిప్యూటీ CM పవన్ వచ్చిన సందర్భంగా బాలినేని ప్రత్యక్షమయ్యారు. మళ్లీ వైసీపీలోకి బాలినేని అంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఇక్కడ కనిపించడంతో ఓ క్లారిటీ వచ్చింది. పవన్ ప్రసంగంలో బాలినేని మంచి నేత అని చెప్పడంతో, ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాక్ నడుస్తోంది.
News July 5, 2025
ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.