News August 24, 2025
ఒంగోలు: టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో..?

ఒంగోలులో TDP సమావేశం ఆదివారం జరగనుంది. ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడి ఎంపికపై త్రీ మెన్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయాలు సేకరించనుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. యువనేత దామచర్ల సత్యతో పాటు మరికొందరు రేసులో ఉన్నట్లు సమాచారం. ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందని మీరు అనుకుంటున్నారు?
Similar News
News August 24, 2025
వై.పాలెం: తెలుగులో టాపర్‌గా మనోహర్

ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లికి పుచ్చనూతల మనోహర్ DSCలో సత్తా చాటాడు. SA తెలుగులో 84.82 మార్కులతో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. TGTలో 74.4 మార్కులతో 28వ ర్యాంక్ పొందాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో అతడిని పలువురు అభినందించారు.
News August 24, 2025
ప్రకాశం: DSC.. సోషల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

DSC మెరిట్ జాబితాలో కనిగిరికి చెందిన ఇరువురి వెంకట హర్షిత సత్తా చాటింది. SGT సోషల్‌లో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించింది. SGT ఇంగ్లిష్‌లో 16వ ర్యాంక్, ఎస్జీటీలో 7వ ర్యాంక్, మోడల్ స్కూల్ టీజీటీలో 4వ ర్యాంక్ పొందింది. ఆమె తండ్రి కృష్ణారెడ్డి ప్రభుత్వ టీచర్. హర్షితను పలువురు అభినందించారు.
News August 24, 2025
ఎరుపెక్కిన ఒంగోలు

ఒంగోలులో తొలిసారిగా నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. 28వ రాష్ట్ర మహాసభకు ఒంగోలు వేదిక కావడంతో కొన్ని రోజులుగా జిల్లా సీపీఐ నాయకత్వం, మహాసభలను సక్సెస్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీతో మహాసభ సూపర్ సక్సెస్ అంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. మొత్తం మీద ఒంగోలు నగరం ఎర్రజెండాలతో రెపరెపలాడింది.