News July 7, 2025

ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసరని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Similar News

News July 7, 2025

సిరిసిల్ల: జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

సిరిసిల్ల జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 3.2, చందుర్తి 14.6, వేములవాడ రూరల్ 17.6, బోయినపల్లి 17.6, వేములవాడ 9.4, సిరిసిల్ల 18.1, కోనరావుపేట 12.3, వీర్నపల్లి 9.3, ఎల్లారెడ్డిపేట 27.7, గంభీరావుపేట 20.4, ముస్తాబాద్ 21.2, తంగళ్ళపల్లి 39, ఇల్లంతకుంట 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తం జిల్లాలో ఆవరేజ్ గా 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 7, 2025

VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

News July 7, 2025

బుట్టాయిగూడెం : ఐటీడీఏ పీవో‌కు వినతి ఇచ్చిన గిరిజన నేతలు

image

బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలో ఐటీడీఏ పీఓ రాముల నాయక్‌ను టీ నర్సాపురం మండల బంజారా బజరంగీభేరి కమిటీ నాయకులు సోమవారం కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ టీ నర్సాపురం మండలంలోని గిరిజన తండాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఇస్లావత్ ప్రేమ్ చంద్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.