News October 3, 2024
ఒంగోలు: నేటి నుంచి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ఒంగోలులోని కొండమీద వెలసిన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలను నేటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.
Similar News
News December 23, 2025
గంజాయి నిర్మూలనే టార్గెట్: ప్రకాశం ఎస్పీ

జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా స్పెషల్ టీం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 6 గంజాయి కేసులలో 25 మంది వద్ద 9.87 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రైళ్లలో తనిఖీలు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసి 72 కిలోలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
News December 23, 2025
గిఫ్ట్ అని క్లిక్ చేస్తే.. అంతా ఫట్: ప్రకాశం పోలీస్ హెచ్చరిక

వాట్సాప్‌లకు గిఫ్టుల పేరిట వచ్చే ఏపీకె ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని పోలీసులు మంగళవారం కీలక సూచన చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గిఫ్ట్ పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపించే వీటిని క్లిక్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.
News December 23, 2025
బాలినేనికి.. నామినేటెడ్ పదవి ఖాయమేనా?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. పదవి బాధ్యత కార్యక్రమంలో బాలినేని పేరెత్తి మరీ జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పవన్ ప్రకటించగా.. ఈ జాబితాలో బాలినేని పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీలో కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయట.


