News December 23, 2024
ఒంగోలు: పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌కు 68 ఫిర్యాదులు
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 68 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
Similar News
News December 23, 2024
తాళ్లూరులో మళ్లీ కంపించిన భూమి
తాళ్లూరు మండలంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒకే రోజు మూడు సార్లు భూకంపం రావడం, మూడు రోజుల నుంచి రోజూ భూమి కంపించడం గమనార్హం.
News December 23, 2024
ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం
ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
News December 23, 2024
ప్రకాశం జిల్లాలో ఒకేరోజు 2సార్లు భూకంపం
ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ముండ్లమూరు మండలంలో ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాత్రి 7 గంటల సమయంలో మరోసారి భూమి కంపించినట్లు సమాచారం. తాళ్లూరు మండలంలో సాయంత్రం గంట వ్యవధిలో 2సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇలా భూమిలో ప్రకంపనలకు కారణం భూమిలోని పొరల సర్దుబాటేనని పరిశోధకులు అంటున్నారు.