News March 25, 2025

ఒంగోలు: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

image

ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ జరుగుతున్న ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్, సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

Similar News

News March 28, 2025

ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

image

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.

News March 28, 2025

కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

image

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2025

ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

image

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.

error: Content is protected !!