News February 2, 2025
ఒంగోలు: పవన్ కళ్యాణ్ ఫొటో లేదని కలెక్టర్‌కు లేఖ

ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేశ్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలు లేవని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News March 8, 2025
దోర్నాల: పెట్రోల్ దాడిలో ఇద్దరూ మృతి

పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో భూ వివాదం కారణంగా సైదాబీ (35), నాగూర్ వలి (23)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగూర్ వలి శుక్రవారం మధ్యాహ్నం మరణించగా, సైదాబీ రాత్రి 12:50 నిమిషాలకు మృతి చెందారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతితో విషాదం నెలకొంది.
News March 8, 2025
నేడు మార్కాపురానికి CM రాక.. ఉత్కంఠ

మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ప్రకాశం వాసులు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై బహిరంగ సభలో సీఎం చేసే ప్రకటనపై వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటన చేశారు. అయితే సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా మార్కాపురానికి వస్తున్న వేళ జిల్లా అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
News March 8, 2025
మార్కాపురంలో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన SP

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు నేడు మార్కాపురం రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, SSG ఆఫీసర్స్ కలిసి మార్కాపురంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ తనిఖీలను శుక్రవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వివరించారు.