News March 21, 2025

ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

image

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

Similar News

News February 25, 2026

OBC సర్టిఫికెట్ ఇలా అప్లై చేసుకోండి

image

TG: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు OBC సర్టిఫికెట్ ఎంతో కీలకం. ఇందుకోసం కొన్ని డాక్యుమెంట్లతో మీసేవా సెంటర్లలో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారం, ఐడీ&అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, పాత కాస్ట్(కుల ధ్రువీకరణ)& ఇన్‌కమ్ సర్టిఫికెట్, అఫిడవిట్ సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు రూ.45.
Share It

News February 25, 2026

తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య

image

తెలుగు యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. వైజాగ్‌కు చెందిన ఆమె హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉంటూ చదువుకుంటోంది. హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. సొంతూరికి చెందిన మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉరి వేసుకొని చనిపోయిందని తెలుస్తోంది. కాగా అఖిల్ మోసం చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 25, 2026

టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన

image

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే దేశాలపై టారిఫ్‌లు విధించానని, వీటికి చట్టబద్ధత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనివల్ల US ప్రజలకు పన్నుల భారం తగ్గుతుందన్నారు. టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏది ఏమైనా అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.