News February 22, 2025
ఒంగోలు: పెళ్లిలో భోజనాల వద్ద గొడవ

పెళ్లిలో భోజనాల గొడవ గాలివానలా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. అందులో జిలానీ భోజనాలు వడ్డిస్తుండగా, తమకు సరిగా మర్యాద చేయలేదని అన్వర్, నజీర్, సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతటితో వివాదం ముగిసిందనగా, విందు ముగిసిన తరువాత జిలానీపై ముగ్గురు దాడి చేశారు. జిలానీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 23, 2025
FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.
News April 23, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.