News March 23, 2025
ఒంగోలు: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News March 25, 2025
ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
News March 24, 2025
KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
News March 24, 2025
ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.