News March 1, 2025

ఒంగోలు: బాలికను గర్భవతిని చేశాడు.. పరారయ్యాడు

image

తన పిన్ని కూతురు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లుగా నమ్మించి ఆరిఫ్ బాలికను తన గదికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ యువకుడు పరారయ్యాడు. ఒంగోలులో ఓ బాలిక తన స్నేహితుడి ద్వారా పరిచయమైంది. బాలికపై కన్నేసిన యువకుడు ఇన్స్టాగ్రామ్‌లో రోజూ చాట్ చేస్తూ పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 1, 2025

పార్వతీపురం: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

image

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు పార్వతీపురం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని  సూచించారు.

News March 1, 2025

సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.

News March 1, 2025

కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 

image

ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

error: Content is protected !!