News March 28, 2024

ఒంగోలు: ‘బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి’

image

వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు కూడా లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం ప్రకాశ్ భవన్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ఎస్.హెచ్.జి మహిళల జీవనోపాధి మరింత మెరుగుపడేలా రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యా రుణాలు మంజూరు వేగవంతం చేయాలన్నారు.

Similar News

News July 3, 2024

శానంపూడి ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్య

image

శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్‌ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న రమావంత్‌ రవినాయక్‌ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.

News July 3, 2024

ప్రకాశం: భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?

image

రాచర్ల మండలం రామాపురం గ్రామంలో జూన్ 29వ తేదీన ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లుగా డీఎస్పీ బాలసుందరావు మంగళవారం వెల్లడించారు. పొలం పంపకం విషయంలో సొంత భార్య రాజేశ్వరి భర్త స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయించింది. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ బాలసుందరావు తెలిపారు.

News July 2, 2024

మార్కాపురం: భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష

image

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మార్కాపురంలోని శరభయ్య మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019లో భార్య పార్వతి నిద్రిస్తుండగా గొడ్డలి వెనుక భాగంతో తలపై కొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు.