News April 6, 2025
ఒంగోలు: మసాజ్ సెంటర్‌పై దాడులు

మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఒంగోలులోని ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News September 11, 2025
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.
News September 11, 2025
ఒంగోలు: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.
News September 10, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.