News April 9, 2025

ఒంగోలు: మేనకోడలిపై 4ఏళ్లుగా అఘాయిత్యం

image

సొంత మేనమామ మేనకోడలిపై 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని బాలిక తట్టుకోలేక ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. తల్లి అరబ్ దేశంలో పని కోసం వెళ్లింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పుకున్న ఏమి చేయకపోవడంతో 4 సంవత్సరాలుగా మేనమామ చిత్రహింసలు భరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాసి పనిచేసుకుంటూ ఉంది. ఎస్సై కృష్ణ పావని కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 17, 2025

ప్రకాశంలో రెడ్డి వర్సెస్ రెడ్డి.. పీక్స్ లోకి పాలి’ ట్రిక్స్’..!

image

ప్రకాశం రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉగ్ర పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది అధిష్టానం అభిమతం. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఉగ్ర పేరు దాదాపు ఖరారు చేయగా, ప్రకాశం రాజకీయం రెడ్డి వర్సెస్ రెడ్డి అంటూ జోరుగా చర్చ సాగుతోంది.

News December 17, 2025

టంగుటూరు వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

టంగుటూరులోని టోల్ ప్లాజాకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. టోల్ ప్లాజాకు సమీపంలోకి బైక్ రాగానే, అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రహదారిపై బలంగా పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

News December 17, 2025

గిద్దలూరు: దిగువ మెట్ట అటవీ ప్రాంతంలో లారీ ప్రమాదం..

image

గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎస్‌–టర్నింగ్ వద్ద లారీ ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి బళ్లారి వెళ్తున్న పత్తి లోడ్ మినీ లారీ అదుపుతప్పి కింద పడింది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.