News August 24, 2025

ఒంగోలు రాజకీయాలు.. 2 రోజుల్లో క్లారిటీ

image

ఒంగోలు టీడీపీ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ కమిటీ ఏర్పాటుకై అధిష్ఠానం నియమించబడ్డ ప్రతినిధులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. అయితే అధ్యక్ష పదవికి ముగ్గురు ఎమ్మెల్యేలు, మరొకరు నామినేటెడ్ పోస్ట్ గల ప్రతినిధి పోటీలో ఉన్నట్లు సమాచారం. 2 రోజుల్లో టీడీపీ అధిష్ఠానం పార్లమెంట్ కమిటీని ప్రకటించనుంది.

Similar News

News August 25, 2025

గంజా అంటే.. ప్రకాశంలో చుక్కలే.!

image

ప్రకాశం జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గతంలో ఒంగోలు గంజాయికి అడ్డా అనే పేరు ప్రాచుర్యంలో ఉండేది. ఏ మేరకు వాస్తవం ఉందో కానీ, ఎస్పీ దామోదర్ సారథ్యంలో గంజా మాఫియా తాట తీస్తున్నారని ఒంగోలు ప్రజల మాట. ఆకస్మిక తనిఖీలతో పోలీసులు రంగంలోకి దిగుతుండగా, గంజా బ్యాచ్ ఊహించని స్థితిలో పట్టుబడుతోంది. మత్తు వదిలిస్తున్న ప్రకాశం పోలీస్ తీరును శభాష్ అనాల్సిందే.

News August 24, 2025

సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది: జిల్లా SP

image

ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.

News August 24, 2025

వై.పాలెం: తెలుగులో టాపర్‌గా మనోహర్

image

ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లికి పుచ్చనూతల మనోహర్ DSCలో సత్తా చాటాడు. SA తెలుగులో 84.82 మార్కులతో ప్రకాశం జిల్లా మొదటి ర్యాంక్ సాధించాడు. TGTలో 74.4 మార్కులతో 28వ ర్యాంక్ పొందాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో అతడిని పలువురు అభినందించారు.