News March 16, 2025

ఒంగోలు రిమ్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిన్న రాత్రి 11.30 గంటలకు ఒంటరిగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. క్యాజువాలిటీ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో సీనియర్ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించారు. సంబంధిత డాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ ఉన్నపళంగా ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. మహిళా కలెక్టర్ రాత్రివేళ చెకింగ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News March 17, 2025

ఒంగోలు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి

image

రాజ్యసభ సభ్యుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలిపారు. కొన్ని రోజులుగా ఎర్రం పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. పిచ్చమ్మ అంత్యక్రియలు ఈరోజా రేపా అనేది కుటుంబం సభ్యుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2025

పదో తరగతి విద్యార్థులకు ALL THE BEST: ప్రకాశం SP

image

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన ALL THE BEST తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

News March 16, 2025

మహిళా రక్షణ మా ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీమ్స్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

error: Content is protected !!