News August 7, 2025
ఒంగోలు: రైల్వే లైన్‌కు మరో గ్రీన్ సిగ్నల్

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్‌కు మరో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రకాశం జిల్లాలో పొదిలి, పామూరు, కనిగిరి, దర్శి రైల్వే స్టేషన్ల నిర్మాణంపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రయల్ ట్రైన్ కూడా రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు మరింత చిగురించాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వ భూములను రైల్వే శాఖకు అప్పగించాలని నిర్ణయించడంతో ప్రాజెక్ట్ మరింత స్పీడ్ కానుంది.
Similar News
News August 30, 2025
ప్రకాశం: బార్ల లైసెన్స్ కోసం 78 దరఖాస్తులు.. కాసేపట్లో లాటరీ..!

ఓపెన్ కేటగిరీకి సంబంధించి 26 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 78 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కార్యాలయంలో మాట్లాడారు. 26 బార్లకు గాను 17 బార్లకు దరఖాస్తులు అందాయన్నారు. గీత కులాలకు కేటాయించిన 3 బార్లకు 14 వచ్చాయని తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ వద్ద కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందన్నారు.
News August 30, 2025
చీమకుర్తిలోని క్వారీలో ప్రమాదం

చీమకుర్తిలోని మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి క్వారీలోని ఓ అంచు విరిగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే రాళ్లు విరిగిపడిన సమయంలో 50 మంది కూలీలు భోజనానికి వెళ్లినట్లు తెలిసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది. కాగా క్వారీలో ఉన్న మెషిన్ పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది.
News August 30, 2025
గిద్దలూరులో రైతు బజార్ స్థల సమీకరణకు ఎమ్మెల్యే అశోక్‌కు వినతి

గిద్దలూరు పట్టణంలో శుక్రవారం MLA అశోక్ రెడ్డిను జిల్లా సహాయ మార్కెటింగ్ సంచాలకులు వరలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు రైతు బజారు ఏర్పాటుకు సంబంధించిన స్థల సమీకరణకు వివరాలు తెలుసుకున్నారు. రైతుల కోసం కూటమి ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.