News February 14, 2025
ఒంగోలు: వీడియో కాన్ఫరెన్స్‌లో మాగుంట
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులు, అభిమానులతో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. వారంతా ఎంపీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఒంగోలుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఘన శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
చీమకుర్తి: ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ
ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు.
News February 13, 2025
ప్రకాశం జిల్లా రైతులకు ముఖ్య సూచనలు
ప్రకాశం జిల్లాలోని రైతులు తమ భూముల వివరాలను ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకం, ఫోన్ నంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే అగ్రికల్చర్ అసిస్టెంట్ రిజిస్టర్ చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 13, 2025
ఒంగోలు: ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష
లారీని అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ మేరకు ఒంగోలు కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2019లో పోతవరం కుంట వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఆదినారాయణను అరెస్ట్ చేసి హాజరు పరచగా కోర్టు తీర్పునిచ్చింది. సాక్ష్యాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.