News March 3, 2025
ఒంగోలు: శారీరక దృఢత్వానికి యోగా అవసరం

మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా పోలీసులు, హోంగార్డ్స్, డీపీఓ సిబ్బందికి ఆదివారం ఒంగోలులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర శాఖల సిబ్బంది ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో యోగా, నృత్యం, డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మాట్లాడుతూ.. నిత్యం పలు రకాల విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు.
Similar News
News March 2, 2025
జనసేన కమిటీలో ప్రకాశం జిల్లా నేతలకు కీలక బాధ్యతలు.!

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మార్చి 14న పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నిర్వహణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించినట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.
News March 2, 2025
ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
News March 2, 2025
ఒంగోలు: విద్యార్థుల లక్ష్యాలు తెలుసుకున్న కలెక్టర్

ఇంటర్మీడియట్ , పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా.. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులతో శనివారం ప్రకాశం భవనం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు. వారి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.