News April 3, 2024

ఒంగోలు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తప్పనిసరి

image

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రముఖుల ప్రొఫైల్ పిక్ తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News October 1, 2025

అంకుల్ మీతో వస్తాం.. అన్నం పెడతారా!

image

తల్లిని కోల్పోయారు. తండ్రి ఆదరణ లేదు. ఆ ఇద్దరు చిన్నారులకు దిక్కుతోచని స్థితి. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే దారిలో హెల్ప్ సంస్థ పీడీ సాగర్‌కు ఆ ఇద్దరూ తారసపడ్డారు. ఒకరు 7 ఏళ్ల బాలుడు. మరొకరు 8 ఏళ్ల బాలిక. వీరిని సాగర్ పలకరించి వివరాలు కోరగా అమ్మ చనిపోయిందని, నాన్న ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. ‘అంకుల్ మీతో వస్తాం. అన్నం పెడతారా’ అని కోరడంతో ఆయన వారిని ఒంగోలు బొమ్మరిల్లులో చేర్పించారు.

News October 1, 2025

ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీలపై కసరత్తు

image

ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను డీఈవో కిరణ్ కుమార్ సేకరిస్తున్నారు. DSC-2025లో నూతనంగా పోస్టులు సాధించిన అభ్యర్థులకు ఈనెల 3 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. చివరి రోజు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అసలు టీచర్స్ లేకుండా సర్దుబాటుపై నడుస్తున్న పాఠశాలలకు తొలి ప్రాధాన్యత ఇచ్చేలా, నిష్పత్తి ఆధారంగా ఖాళీలు భర్తీ చేయనున్నారు.

News October 1, 2025

ప్రకాశం ఎస్పీని కలిసిన వైసీపీ నేతలు

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైసీపీ మార్కాపురం ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు తదితర నేతలు కలిశారు. శాంతి భద్రతలపై ఆయనతో మాట్లాడారు.