News April 11, 2024
ఒంగోలు: 30 మంది TDP నేతలపై కేసు నమోదు

ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.
Similar News
News December 19, 2025
ప్రకాశం హార్బర్ కోసం CM ప్రత్యేక చొరవ.!

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయదలచిన ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని CM చంద్రబాబు శుక్రవారం కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ను కోరారు. సాగరమాల పథకం కింద ఫిషింగ్ హార్బర్ కొత్తపట్నం వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాగరమాల పథకం ద్వారా రూ.150 కోట్లు మంజూరు చేయాలని CM కోరారు.
News December 19, 2025
ప్రకాశం: 18 మంది కార్యదర్శులకు నోటీసులు.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్నులను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులకు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా రాత పూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని డీపీఓ ఆదేశించారు.
News December 19, 2025
ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.


