News August 6, 2024

ఒంగోలు: ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మూడవ విడత ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 26వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఒకటికంటే ఎక్కువ ఐటీఐ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 30, 2024

ప్రకాశం: పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు విడుదల

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు విడుదలైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య?

image

పామూరులోని 565 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాళ్లతో కట్టి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని కరెంటు కాలనీకి చెందిన సిద్ధవటం వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తున్నారు.

News September 30, 2024

గిద్దలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

గిద్దలూరు మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సర్విరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న 6 సంవత్సరాల బాలుడిని, వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.