News March 29, 2026

ఒంటిమిట్టకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

బుధవారం జరగనున్న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణానికి CM చంద్రబాబు రానున్నారు. బుధవారం సా.4:15 గం. ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
▶ 4.30-6:05: TTD గెస్ట్ హౌస్‌లో రెస్ట్
▶ 6:15-6:30: స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
▶ 6:35: సీతారామయ్య కళ్యాణ వేదికకు చేరుకుంటారు
▶ 6:45-8:30: తలంబ్రాలు సమర్పించి కళ్యాణాన్ని తిలకిస్తారు
▶ 8:40: TTD గెస్ట్ హౌస్‌‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.

Similar News

News April 14, 2026

ప్లీజ్.. పిల్లల ముందు గొడవలొద్దు!

image

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం గొడవ పడొద్దు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల మనసును బాధిస్తుంది. మరికొందరు నైబర్స్‌తో ఘర్షణకు దిగుతారు. అలాంటి సందర్భాల్లోనూ పిల్లలు భయానికి గురవుతారు. ఇది వారిలో అభద్రతాభావానికి దారి తీస్తుంది. భవిష్యత్తులో వారూ చెడు మాటలు మాట్లాడటం, పెరిగి పెద్దయ్యే క్రమంలో గొడవలకు దిగే ప్రమాదం ఉంటుంది.

News April 14, 2026

విద్యార్థి కాళ్లకు సంకెళ్లు వేసిన టీచర్

image

బనగానపల్లెలో సోమవారం అమానుష ఘటన జరిగింది. ఓ పాఠశాల విద్యార్థి అల్లరి చేశాడనే నెపంతో ఉపాధ్యాయుడు బాలుడి కాలికి ఇనుప గొలుసులతో చెక్కమొద్దును కట్టారు. ఆ సంకెళ్లతోనే బాలుడు రోడ్డుపైకి రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన టీచర్‌ను పోలీసులు మందలించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2026

నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

image

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.