News April 11, 2025

ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం చేపడతాం: సీఎం చంద్రబాబు

image

తిరుమల తరహాలో ఒంటిమిట్ట రాములోరి ఆలయంలోనూ అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భక్తులు ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. త్వరలో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.

Similar News

News April 18, 2025

IPL: ఆ టీమ్‌కు కెప్టెన్ దూరం?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ ఆ మ్యాచ్‌లో పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్కాన్స్ తీయించామని, రేపు LSGతో మ్యాచ్‌కు ఆడటం అనుమానమేనని RR వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి పరాగ్ కెప్టెన్సీ చేసే అవకాశముంది.

News April 18, 2025

కథలాపూర్ పీహెచ్సీలో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తినష్టం

image

కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ గదిలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాక్సినేషన్ గదిలోని నాలుగు ఫ్రిడ్జ్లు, వాక్సిన్లు పూర్తిగా కాలిపోయాయి. 

News April 18, 2025

నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

*ప్యాపిలి మండలంలో 65 లీటర్ల నాటుసారా సీజ్*నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ దారుణ హత్య?*గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొన్న నంద్యాల ఎంపీ*6 నెలల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి*జొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: శ్రీశైలం MLA *నంద్యాల జిల్లాలోని మండలాల్లో ఈదురుగాలులు.. రైతులకు తీవ్రనష్టం*అహోబిలంలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు

error: Content is protected !!