News April 2, 2025
ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి రాసిన లేఖలో కోరారు.
Similar News
News July 8, 2025
కడప SP పరిష్కార వేదికకు 178 ఫిర్యాదులు

ఫిర్యాదుదారులకు చట్టపరమైన న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (PGRS)లో 178 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ పలు సమస్యలపై స్వయంగా విచారణ జరిపి, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించారు.
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.