News April 12, 2025
ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి రథోత్సవం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథాన్ని అధిష్టించి మాడ వీధుల్లో విహరించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News December 28, 2025
కంచిలి వద్ద ప్రమాదం.. 10th విద్యార్థి స్పాట్‌డెడ్

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రణీత్ ఆదివారం కావడంతో తండ్రితో కలిసి బైక్‌పై సోంపేట మండలం పత్రకొండ నుంచి కంచిలి వస్తుండగా జలంత్రకోట జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మట్టా ప్రణీత్(16) మృతి చెందగా.. అతని తండ్రి హేమంతరావుకు (45) తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 28, 2025
PHOTOS: బాలరాముడిని దర్శించుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్య రామజన్మ భూమి మందిరాన్ని సందర్శించారు. ఆలయం మొత్తం కలియతిరిగి అక్కడి శిల్పకళను తిలకించారు. అనంతరం బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అద్భుతమైన అయోధ్య ఆలయంలో బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సీఎం ట్వీట్ చేశారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంటాయని పేర్కొన్నారు.
News December 28, 2025
ESIC హాస్పిటల్ తిరునెల్వేలిలో ఉద్యోగాలు

ESIC హాస్పిటల్, తిరునెల్వేలి 27 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 5న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. స్పెషలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయసు 67ఏళ్లు కాగా.. Sr. రెసిడెంట్(3Yr కాంట్రాక్ట్)కు 45ఏళ్లు, Sr. రెసిడెంట్(1Yr కాంట్రాక్ట్)కు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: rodelhi.esic.gov.in/


