News October 29, 2025
ఒంటిమిట్ట రామాలయం నూతన అభివృద్ధి పనులకు ఆమోదం: TTD

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ నూతన అభివృద్ధి పనులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమలలో బోర్డు మీటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారి పక్కనే రూ.37 కోట్లతో భక్తులకు 100 గదుల భవనాన్ని, ఆలయం సమీపంలో రూ.2.9 కోట్లతో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించేలా పవిత్ర వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
Similar News
News October 29, 2025
సంగారెడ్డి: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల పురుష అభ్యర్థులు అర్హులు. 10 క్లాస్ పాసై, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా ఇస్తామన్నారు.
News October 29, 2025
అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.


