News February 28, 2026
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

TTD ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర కలిసి ఆవిష్కరించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
ప్రొద్దుటూరు హాస్టళ్లో విద్యార్థి సూసైడ్.. డీఈవో ఆరా.!

పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. MEOలు శోభా, సావిత్రి, AMO విజయభాస్కర్ ఉన్నారు.
News March 2, 2026
కోదాడ: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌పై అట్రాసిటీ కేసు

భూ రిజిస్ట్రేషన్ వివాదంలో కౌన్సిలర్ నెమ్మది బాబుపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన ఘటనలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, శుక్రవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి తెలిపారు.
News March 2, 2026
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. రంగులు చల్లుకోవచ్చా?

మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున ఆ రోజు రంగులు చల్లుకోవడం చేయకూడదని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు, వేడుకలు చేయకూడదంటున్నారు. అయితే ఈ సమయంలో చేసే మంత్ర జపం, అనుష్టానాలకు వేల రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ ప్రభావం ముగిసిన తర్వాత, అంటే మార్చి 4న ఎలాంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగుల హోలీని వైభవంగా జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.


