News December 20, 2025
ఒకరికొకరు తోడుగా విధినే గెలిచిన జంట ❤️

‘ధర్మార్ధ కామములలోన ఏనాడు నీతోడు ఎన్నడూ నే విడిచిపోను.. ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్లు నీ నీడనై నిలిచి కాపాడుతాను’ అనే పాటకు నిదర్శనం ‘Family Man’ నటుడు షరీబ్(JK). ఈయన 2003లో నస్రీన్‌ను పెళ్లాడారు. ఆరంభంలో ఆమె తన కష్టార్జితంతో భర్తను ప్రోత్సహించారు. తర్వాత నస్రీన్ నోటి క్యాన్సర్ బారిన పడగా భర్త అండగా నిలిచారు. 4సర్జరీల తర్వాత ఆమె కోలుకున్నారు. ఒకరికొకరు తోడుగా నిలిచి గెలిచిన ఆ జంట ఎందరికో ఆదర్శం.
Similar News
News December 22, 2025
జాకబ్ డఫీ హిస్టరీ క్రియేట్ చేశాడు

న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ దేశం తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు(81) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఆ దేశ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(79w-1985)ను అధిగమించారు. కాగా డఫీ ఈ ఏడాది 4 టెస్టులు, 11 వన్డేలు, 21 టీ20లు ఆడారు. మరోవైపు మూడో టెస్టులో వెస్టిండీస్‌పై NZ 323 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో 2-0తో సిరీస్‌ను వశం చేసుకుంది.
News December 22, 2025
1729.. దీన్ని రామానుజన్ నంబర్ ఎందుకంటారు?

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జబ్బు పడి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ప్రొఫెసర్ హార్డీ ఆయన్ని కలవడానికి ట్యాక్సీలో వెళ్లారు. దాని నంబర్ 1729. హార్డీ అది బోరింగ్ నంబర్ అనగా.. రామానుజన్ వెంటనే దాని గురించి చెబుతూ రెండు వేర్వేరు ఘనాల (Cubes) జతల మొత్తంగా (పైన చిత్రంలో చూపినట్లుగా) రాయగలిగే అతి చిన్న నంబర్ ఇదేనని చెప్పారు. అందుకే దీన్ని Ramanujan Number అంటారు. ఈరోజు రామానుజన్ జయంతి (గణిత దినోత్సవం).
News December 22, 2025
ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ఎవరినైనా అద్దెకు తీసుకోవచ్చు

అమ్మ, నాన్న కావాలా? పెళ్లిలో సందడి చేసే స్నేహితులు కావాలా? జపాన్‌లో ఎవరినైనా అద్దెకు తీసుకోవచ్చు. అక్కడున్న ‘రెంట్ ఏ ఫ్యామిలీ’ సర్వీస్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఫంక్షన్లలో ఫ్రెండ్స్, ఫ్యామిలీగా నటించేందుకు నటీనటులు అందుబాటులో ఉంటారు. వీరు అచ్చం మీ సొంత మనుషుల్లాగే కలిసిపోయి, అంత్యక్రియల్లో ఏడుస్తారు.. పెళ్లిళ్లలో నవ్వుతూ ఫొటోలు దిగుతారు. ఒక్కొక్కరికి 10 వేల యెన్స్ వరకూ చెల్లించాల్సి ఉంటుంది.


