News December 27, 2025

ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ!

image

AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉన్న సందర్భంగా పెన్షన్లను డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. మిగిలిపోయిన పెన్షన్లు జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది.

Similar News

News December 30, 2025

ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

image

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>

News December 30, 2025

హమాస్‌కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

image

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

News December 30, 2025

వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.