News August 23, 2025
ఒకే ఊరిలో 8 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

కౌతాళం మం. నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ కేటగిరిలో వడ్డే నాగరాజు కన్నడ సబ్జెక్ట్‌లో కర్నూలు జిల్లా రెండో ర్యాంక్, తాలూరు స్వాతి సోషల్‌లో జిల్లా ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టి.మంజుశ్రీ మ్యాథ్స్‌లో రాణించారు. అలాగే SGT విభాగంలో కె.కావ్య జిల్లా మూడో ర్యాంక్ సాధించారు. రణ్ రాజ్, రాంతుల్ల, విజయ కుమార్, వైశాఖ శెట్టి సైతం ఉద్యోగాలు పొందారు.
Similar News
News August 23, 2025
ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి: ఏఎస్పీ

స్వాతంత్ర్య సమరయోధుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని ఏఎస్పీ హుస్సేన్ పీరా అన్నారు. శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
News August 23, 2025
కర్నూలు: సాధారణ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని అన్నారు.
News August 23, 2025
జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోంది: కలెక్టర్

జిల్లా పారిశ్రామికంగా గణనీయమైన ప్రగతి సాధిస్తోందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.