News March 30, 2025
ఒకే కుటుంబంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

ఇటీవల విడుదలైన పలు ప్రభుత్వ ఉద్యోగాల ఫలితాలలో కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉద్యోగాలు సాధించారు. వారిలో ఇద్దరు అసిస్టెంట్ లోకో పైలట్, ఇద్దరు జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్, ఒకరు ఏపీ హైకోర్టులో సబర్డినేట్ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామంలో ఉంటూ ఉద్యోగాలు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు కొనియాడారు.
Similar News
News November 15, 2025
విశాఖ: రెండో రోజు 48 ఎంఓయూలు

విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో 48 ఎంఓయూలు జరిగాయి. వైద్యారోగ్యం, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. వీటి ద్వారా రూ.48,430 కోట్ల పెట్టుబడులు, 94,155 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్, సవిత, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.
News November 15, 2025
GWL: టీబీ డ్యాం కు కొత్త క్రస్ట్ గేట్లు..!

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు రూ. 80 కోట్లతో 30 కొత్త క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రి బోసరాజు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బెంగళూరులో జరిగిన నీటి సలహా మండలి సమావేశంలో టీబీ డ్యాం గేట్ల పటిష్ఠతపై చర్చ జరిగింది. గతేడాది డ్యాం 19వ గేటు కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేటు అమర్చారు. ఇంజినీరింగ్ నిపుణులు అన్ని గేట్లు మార్చాలని సూచించడంతో నిర్ణయం తీసుకున్నామన్నారు.
News November 15, 2025
రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.


