News March 1, 2026

ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం.. ట్రంప్ ప్రకటన

image

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను అంతమొందించామని వెల్లడించారు. US-ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే సైనిక ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.

Similar News

News March 2, 2026

దాడికి ముందు ఇరాన్‌ పౌరులకు ఇజ్రాయెల్ మెసేజ్

image

ఇరాన్‌పై USతో కలిసి మొదటి దాడి చేసే కొన్ని నిమిషాల ముందు అక్కడి పౌరులు, అధికారులకు ఇజ్రాయెల్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ప్రార్థన వేళలు తెలిపే ‘బడే‌సబాహ్’ యాప్ హ్యాక్ చేసి నోటిఫికేషన్లు పంపింది. ‘ప్రతీకారానికి సమయం వచ్చింది’, ‘అమాయక ఇరాన్ ప్రజలను పీడిస్తున్న వారు ఆయుధాలు వదలండి’ అంటూ ఆ సందేశాలు సాగాయి. దాడిపై ఇరాన్ ప్రజల మద్దతు కోసం, అధికారులను హెచ్చరించేందుకు ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

News March 2, 2026

అదే నిజమైతే మరో రికార్డ్!

image

ధురంధర్-2 రన్‌టైమ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం నిడివి 3 గంటల 55 నిమిషాలు ఉంటుందని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే బాలీవుడ్‌లో గత 26ఏళ్లలో లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న రెండో సినిమాగా నిలుస్తుంది. కాగా LOC కార్గిల్ 4 గంటల ఏడు నిమిషాలతో మొదటి స్థానంలో ఉంది. ఈనెల 19న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హోలీ సందర్భంగా రేపు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News March 2, 2026

విండీస్‌పై విజయం.. భారత్ కొత్త రికార్డులు

image

T20WC: వెస్ట్ఇండీస్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్ ఈ మ్యాచ్‌తో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. 196 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన హైయెస్ట్ సక్సస్‌ఫుల్ ఛేజ్‌ నమోదు చేసింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా తర్వాత అతిపెద్ద టోటల్‌ను ఛేజ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. T20WCలో సెమీస్‌కు ఆరుసార్లు క్వాలిఫై అయిన జట్టుగా ఇంగ్లండ్, పాక్ సరసన నిలిచింది.