News January 7, 2026
ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండవచ్చా?

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
Similar News
News February 21, 2026
T20WC: భారీ వర్షం.. మ్యాచ్ రద్దు

కొలంబో: సూపర్-8లో న్యూజిలాండ్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దైంది. టాస్ పడిన కాసేపటికే వాన మొదలు కాగా ఇప్పటి వరకు తగ్గుతుందేమో అని వేచి చూశారు. ప్రస్తుతం వర్షం మరింత పెద్దది కావడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు టీమ్‌లు చెరొక పాయింట్ పంచుకోనున్నాయి. అటు రేపు పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.
News February 21, 2026
6 రాష్ట్రాల్లో SIR పూర్తి.. గుజరాత్‌లో 68 లక్షల ఓట్లు తొలగింపు

దేశంలోని 6 రాష్ట్రాలు/UTలలో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పూర్తిచేసినట్లు EC వెల్లడించింది. వివిధ కారణాలతో అత్యధికంగా గుజరాత్‌లో 68.12L ఓట్లను తొలగించినట్లు తెలిపింది. MPలో 34.25L, రాజస్థాన్‌లో 31.36L, ఛత్తీస్‌గఢ్‌లో 24.99L, కేరళలో 8.97L, గోవాలో 1.27L, అండమాన్&నికోబార్‌లో 52K, పుదుచ్చేరిలో 77K, లక్షద్వీప్‌లో 206 ఓట్లను తీసివేసినట్లు పేర్కొంది. WB, TN, UP డేటాను ఈ నెలాఖరులో విడుదల చేస్తామంది.
News February 21, 2026
T20WC.. సూపర్-8లో మ్యాచ్ రద్దయితే?

T20WC సూపర్-8లో ప్రతి జట్టు 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఏదైనా కారణాలతో మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే లేదు. అందువల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. దీంతో మిగిలిన మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. లేదా ఇతర గేమ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా ఇవాళ జరగాల్సిన న్యూజిలాండ్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా ఇప్పటికీ ప్రారంభమవలేదు. గ్రూప్-1లో IND, SA, WI, ZIM, గ్రూప్-2లో ENG, NZ, PAK, SL ఉన్నాయి.


