News March 1, 2026

ఒక్కరి చావుకు వందల మంది బలి!

image

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని అంతం చేసినట్లు ట్రంప్ ప్రకటన, మీడియా రిపోర్ట్స్ నేపథ్యంలో US తన ప్రధాన లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌తో కలిసి చేస్తున్న ఈ దాడుల్లో కొన్ని వందల అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటివరకు 200 మందికిపైగా చనిపోగా 700 మందికిపైగా గాయపడ్డారు. ఇక మృతుల్లో 85 మంది బాలికలూ ఉన్నారు. మినాబ్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో వీరు ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News March 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 2, 2026

TODAY TOP NEWS

image

* ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
* ఖమేనీ హత్యకు నిరసనగా HYD, BLR, ఢిల్లీలో నిరసనలు
* విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI
* కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN
* 2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
* GST వసూళ్లలో ఏపీ, తెలంగాణ దూకుడు
* సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
* T20WC సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
* ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

News March 2, 2026

HYDలో హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు

image

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్‌లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.