News December 15, 2025
ఒక్క ఓటుతో కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచిన శోభారాణి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News December 27, 2025
స్వేచ్ఛనిస్తే మళ్లీ బీజేపీలోకి..: రాజాసింగ్

TG: తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఓ అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సిందే అని అన్నారు. అలాగే తాను కూడా రీఎంట్రీ ఇస్తాననే హింట్ ఇచ్చారు.
News December 27, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
చీరాల వాడరేవులో కలెక్టర్ పర్యటన

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం చీరాల వాడరేవు, కట్టవారిపాలెం ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో చేరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహశీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


