News December 29, 2025
ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.
Similar News
News January 1, 2026
‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
News January 1, 2026
AQI: దేశంలో హైదరాబాద్ బెస్ట్

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తక్కువగా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో మంగళవారం AQI 150కి పైగానే ఉండగా హైదరాబాద్‌లో 99గా నమోదైంది. ఢిల్లీలో 388, ముంబై 136, కోల్‌కతా 170, చెన్నై 186, బెంగళూరు 115, అహ్మదాబాద్ 164, పుణేలో 247గా ఉంది. కాలుష్యం తక్కువగా ఉండటంతో చాలా మంది హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


