News December 28, 2025

ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

image

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.

Similar News

News December 31, 2025

కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

image

‘X’లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ పొందడానికి క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్ పెంచాలన్న ప్రపోజల్‌పై మస్క్ పాజిటివ్‌గా స్పందించారు. ఒరిజినల్ కంటెంట్‌ క్రియేట్ చేసే వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే కంటెంట్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చెల్లింపుల్లో యూట్యూబ్ అద్భుతంగా ఉందని అంగీకరించారు.

News December 31, 2025

గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్

image

TG: AP ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను పరిరక్షించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ‘గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించం. ఏకపక్షంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. వారి నిర్ణయం CWC, GWDT తీర్పునకు భిన్నంగా ఉంది. అదనపు నీటి హక్కుల కోసం AP రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయ పోరాటానికి పూనుకుంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని తెలిపారు.

News December 31, 2025

న్యూ ఇయర్ విషెస్.. ఈ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

WhatsAppలో వచ్చే న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. .APK, .XAPK లింక్‌తో వచ్చే ఫొటోలు, వీడియోలపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. వాటిలో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి ఉంటుందని, క్లిక్/డౌన్లో‌డ్ చేస్తే పర్సనల్/బ్యాంక్ అకౌంట్స్ డేటా చోరీ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు తెలిసిన నంబర్ల నుంచి వచ్చినా క్లిక్ చేయవద్దంటున్నారు.