News November 21, 2024
ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.
Similar News
News February 22, 2026
శ్రీకాకుళం: రాజకీయ దురంధరుడు ‘బొడ్డేపల్లి’

బొడ్డేపల్లి రాజగోపాలరావు (1923-1992) శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు. ఆరుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించిన ప్రజా నాయకుడు. 1952-1984 మధ్య కాలంలో ఆరుసార్లు (1, 2, 3, 5, 6, 7వ లోక్‌సభలు) శ్రీకాకుళం ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు, ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ వంటి పలు అభివృద్ధి పనులకు ఆయన కారకులు. కాలింగ జాతికి ముద్దు బిడ్డ అని పిలుస్తారు. ఈరోజు ఆయన 34వ వర్ధంతి.
News February 22, 2026
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు

జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్. సురేష్ కుమార్ చెప్పారు. 71 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 71 మంది చీప్ సూపరింటెండెంట్లు, 831 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.
News February 22, 2026
శ్రీకాకుళం: నకిలీ పాసుల కేసు తీవ్ర జాప్యం!

ఆదిత్యుని ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీఐపీ పాసులు కేసును సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తొలుత దర్యాప్తు చేశారు. అనంతరం మొదటి పట్టణ స్టేషన్ పోలీసులకు కేసు అప్పగించారు. దాదాపుగా నకిలీ పాసులు వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించారు. అయితే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రాజకీయ మద్దతు ఉండటం కేసు జాప్యానికి కారణమనే చర్చ నడుస్తోంది.


