News September 12, 2025

ఒక తప్పిదం క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది: SP

image

కామారెడ్డి టౌన్ PS పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 61 మందిపై కేసులు నమోదు చేసి, వారికి కోర్టు మొత్తం రూ.56 వేల జరిమానా విధించింది. SP రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఒక చిన్న తప్పిదం కూడా క్షణాల్లో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News September 12, 2025

‘కిష్కింధపురి’ పబ్లిక్ టాక్

image

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. మూవీ చూసిన వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. హీరోహీరోయిన్ల యాక్టింగ్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ&రేటింగ్.

News September 12, 2025

పాడేరు: ‘మధ్యాహ్నం 3:30 గంటల వరకే ఈ సేవలు’

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.