News January 4, 2025
ఒడిశా గవర్నర్‌గా ప్రకాశం జిల్లా వాసి
ఒడిశా గవర్నర్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా వాసే. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఈయన స్వగ్రామం. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఈయనను ఒడిశాకు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌భవన్‌లో హరిబాబుతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా CMమోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. ఆయన ఉన్నత చదువుల కోసం వైజాగ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
Similar News
News January 6, 2025
ప్రకాశం: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్
➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు చీరాల, ఒంగోలు స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.
News January 6, 2025
ప్రకాశం: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.
News January 6, 2025
మార్కాపురం నుంచి విదేశీ నేరగాళ్లకు సిమ్ములు
దేశంలో రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం వాసుల పేరుతో సిమ్‌లు విదేశీ సైబర్ మోసగాళ్లకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ నుంచి అమరావతికి సమాచారం ఇచ్చాయి. దీంతో మార్కాపురం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర నిఘా సంస్థలు కొన్ని సిమ్ములను గుర్తించగా అందులో 10 సిమ్ములు మార్కాపురం వాసుల పేరుతో ఉన్నట్లు సమాచారం.