News April 19, 2025
ఒడిశా టిన్ బీర్లతో కాకినాడ వ్యక్తి అరెస్ట్

విశాఖ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గురువారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించినట్లు మునగపాక ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. స్థానిక జంక్షన్‌లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కాకినాడకు చెందిన వ్యక్తి అక్రమ మద్యం కారులో ఒడిశాకు తరలిస్తుండగా సుమారు 105 టిన్‌ల బీర్లు లభ్యమయ్యాయి. కారు సీజ్ చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 19, 2025
వనపర్తి కలెక్టర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశం

అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శనివారం వీసీ ద్వారా మంత్రి నిర్వహించిన సమీక్షలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News April 19, 2025
అమరాపురం: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని కాచికుంటకు చెందిన యువకుడు మంజునాథ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాచికుంట గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో యువకుడు ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
మంత్రుల పర్యటనతో రైతులకు చేసేందేమి లేదు: రామన్న

భూ భారతి పేరుతో ఆదిలాబాద్‌లో మంత్రులు పోగులేటి, సీతక్క పర్యటన రైతులకు చేసేందేమి లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 27న కేసీఆర్ చేపట్టే సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.