News February 3, 2025
ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 6, 2025
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కేజీ రూ.170 ధర పలుకుతోంది. స్కిన్‌లెస్ కేజీ రూ.200-210 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150 మధ్య ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొంత కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News July 6, 2025
లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారం

మదనపల్లెలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 169 కేసులు పరిష్కారమైనట్లు అదాలత్ సిబ్బంది తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించిన కక్షదారులను రాజీమార్గంలో కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. క్రిమినల్ 144 కేసులు, సివిల్ 25 కేసులు మొత్తం 169 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కాగా బాధితులకు పరిహారంగా రూ.77 లక్షలు అందజేశారు.