News July 28, 2024

ఒలింపిక్స్‌లో ఘన విజయాలు సాధించాలి: మంత్రి కొండపల్లి

image

భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌లో ఘన విజయాలు సాధించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం ‘ఐ చీర్ ఫర్ భారత్’ నినాదంతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 17, 2026

VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

image

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.

News February 17, 2026

VZM: ‘లింగ వివక్షతను అరికట్టాలి’

image

సమాజంలో ఉన్న లింగ వివక్షత, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.జీవనరాణి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి, ప్రజలకు విస్తృతమైన అవగాహన అవసరమన్నారు. ఈ మేరకు విజయనగరం DMHO కార్యాలయంలో ‘లింగ వివక్షత ఆధారిత హింస నివారణ, సామర్థ్య పెంపుదల’ అనే అంశంపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

News February 16, 2026

విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.