News February 24, 2026
‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.
Similar News
News February 27, 2026
వాట్సాప్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయా?

వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై ‘స్టేటస్’ విభాగంలో యాడ్స్, ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌లో ప్రమోటెడ్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. దీనివల్ల యూజర్‌కు అవసరమైన వ్యాపార సంస్థలతో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఈ మార్పుల వల్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి సురక్షితంగా ఉంటాయని తెలిపింది.
News February 27, 2026
2018 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్లకు ఎదురుదెబ్బ

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన <<19238436>>ఉత్తర్వులను<<>> సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగం చేయలేరా? ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది. సంతృప్తిగా ఉండండి’ అని పేర్కొంది.
News February 27, 2026
ICMRలో 27 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)లో 27 సైంటిస్ట్ B పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ(బయో మెడికల్ సైన్సెస్, ఫార్మసీ) ఫార్మా డీ, ME/MTech, MCA, BE/BTech, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in


