News August 29, 2025
ఓకే పాఠశాలకు చెందిన ఏడుగురికి టీచర్ ఉద్యోగాలు

మహానంది మండలం గోపవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఐదుగురికి ఎస్టీజీ, ఇద్దరికి పీఈటీ పోస్టులు వచ్చాయి. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పేర్కొన్నారు. వీరిని పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు పి.నాగశేషుడు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News August 29, 2025
HYD: తోక జాడించకండి.. మిమ్మల్నే చూస్తున్నారు!

ఖైరతాబాద్ బడా గణేశ్‌తో పాటు నగరంలోని అనేక మండపాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇదే అదునుగా పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో HYD షీ టీమ్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అసభ్యంగా తాకినా, వేధింపులకు పాల్పడినా 100, 112, 9490616555 నంబర్‌కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
News August 29, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.
News August 29, 2025
నిర్మల్: HYDకు ఈ మార్గల్లో వెళ్లండి: ఎస్పీ

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులకు ఎస్పీ జానకి షర్మిల ముఖ్య సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంతో దారి మళ్లించినట్లు చెప్పారు. వాహనదారులు నిర్మల్ వద్ద ఉన్న కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమవైపు తిరిగి, మామడ, ఖానాపూర్, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ మార్గాన్ని అనుసరించి సురక్షితంగా ప్రయాణించాలని ఆమె సూచించారు.