News June 7, 2024
ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


