News June 8, 2024
ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొసం ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.
News November 12, 2025
నల్గొండకు మరో అరుదైన గౌరవం

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్‌కు అందింది.
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.


