News July 15, 2024

ఓటమి తర్వాత ఒంగోలుకు బాలినేని

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి బాలనేని ఓటమి తర్వాత ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని పలు మార్లు ప్రచారంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపై నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జయంతిన చాలా మంది కార్పొరేటర్లు దూరంగా ఉండటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Similar News

News November 8, 2025

సీఎం పర్యటనలో లోపాలు లేకుండా పనిచేయాలి: కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయలని సూచించారు.

News November 8, 2025

కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కూచిపూడిపల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2025

పెద్ద చెర్లోపల్లిలో పర్యటించనున్న CM చంద్రబాబు

image

CM చంద్రబాబు నాయుడు ఈనెల 11న పెద్ద చెర్లోపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి సీఎంఓ నుంచి సమాచారం అందిందన్నారు. మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు MLA లింగన్నపాలెంకు బయలుదేరి వెళ్లారు.