News June 1, 2024

ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్‌పై వైసీపీ వివాదం: ప్రత్తిపాటి

image

ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పోస్టల్ బ్యాలెట్‌పై వివాదాల రేపేందుకు తంటాలు పడుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకళ్లెం ఆశలు ఫలించవని, ఆ పార్టీ ఓటమి పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం కానుందన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోయిందన్నారు.

Similar News

News April 24, 2025

గుంటూరు రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలకం

image

జీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెల 28న జరగనుంది. మేయర్ పదవి కోసం మొత్తం 63 మంది సభ్యుల్లో సగానికి పైగా ఓట్లు అవసరం. గతంలో టీడీపీ మేయర్‌గా ఉన్న కోవెలమూడి రవీంద్రకు మళ్లీ అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికలో 56 కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ ఓటు వేయనున్నారు. నామినేషన్ల గడువు 24 కాగా, 28న పోలింగ్ జరుగుతుంది. గుంటూరు రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలకం కానుంది.

News April 23, 2025

పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

image

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

image

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.

error: Content is protected !!